జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా జైలులోని బెయిరక్ గదులు, వంటగది, జైలు ఆవరణను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.
జైలులో ఉన్న ఖైదీలను కలిసి, వారికి అందుతున్న సదుపాయాలు, భోజనం నాణ్యత గురించి కార్యదర్శి సౌజన్య అడిగి తెలుసుకున్నారు. ఖైదీల బెయిరక్ గదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని జైలర్ కు సూచించారు. ఖైదీలకు సమయానికి బెయిల్స్, ములాఖత్ లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారానికి ఉచిత న్యాయవాదిని నియమించే విషయాన్ని కూడా ఖైదీలకు తెలియపరిచారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఖైదీలకు అందిస్తున్న భోజనం రుచి చూసిన కార్యదర్శి, వారి కోసం నిల్వ ఉంచిన కూరగాయలు, బియ్యం ఉన్న గదిని కూడా పరిశీలించారు. జైలులో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ ను కూడా ఆమె సందర్శించి, అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు.












