ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ప్రొద్దుటూరులో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రొద్దుటూరుకు విచ్చేశారు.
ఈ భేటీలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక ప్రజా సమస్యలపై ఇరువురు నాయకులు కీలకంగా చర్చించారు. నియోజకవర్గంలోని ప్రజల అవసరాలు, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలు, రోడ్లు, ఇతర మౌలిక వసతులపై యల్లటూరు శ్రీనివాసరాజు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని యల్లటూరు శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు.











