కడప నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల వివరాలను ఆలయ వ్యవస్థాపకులు మల్లికార్జున రావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున పవిత్ర నదీజలాలతో నింపిన విశేష కలశాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం యాగశాలలో శ్రీ విజయదుర్గ చండీహోమాలు, శ్రీచక్ర మండపంలో నవావరణ శ్రీచక్ర అర్చన, ప్రత్యేక పూజలు వేద పండితులు రాయపాటి సుబ్బరామశర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు శ్రీ విజయదుర్గాదేవి నవదుర్గ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే ప్రతిరోజు రాత్రి 8:00 గంటలకు శ్రీ విజయదుర్గా మల్లికార్జున స్వాముల ఆలయం చుట్టూ ఆలయ ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.












