తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు వైభవంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ పరిధిలోని బతుకమ్మ ఘాట్ల వద్ద ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అవసరమైన సౌకర్యాలు












