ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన భూములను విక్రయించి, వచ్చిన డబ్బుతో బాధితుల బకాయిలను క్లియర్ చేయాలని సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 9 లక్షల మంది బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా అధిక వడ్డీల ఆశ చూపి ఏజెంట్ల ద్వారా అగ్రిగోల్డ్ సంస్థ వందల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది. ఏజెంట్లకు కమీషన్లు ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు వసూలు చేసిన ఆ సంస్థ, సకాలంలో డిపాజిట్‌దారులకు డబ్బులు తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డిపాజిట్ల రూపంలో వచ్చిన డబ్బుతో అగ్రిగోల్డ్ భారీగా భూములను కొనుగోలు చేసింది. ఎలాంటి వివాదాలు, సమస్యలు లేని అగ్రిగోల్డ్ భూములను విక్రయించి, ఆ ద్వారా వచ్చే మొత్తంతో బాధితులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్నూలు ప్రాంతీయ సీఐడీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
బాధితులతో సమావేశాలు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్ బాధితులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులు నిర్ణయించిన తేదీ, ప్రాంతం ప్రకారం బాధితులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని తమ ఒరిజినల్ పత్రాలను అధికారులతో సరిపోల్చుకుంటున్నారు.

