తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం విధిస్తున్న కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు పెనతుల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెట్టుబడి పెట్టిన పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, పాల్వంచ, అక్టోబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, పాల్వంచ, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ నినో సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను, పనితీరును రైతులపై చూపిస్తోందని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెనతుల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసలే ఎల్ నినో కారణంగా ఆశించినంత వర్షాలు కురవక వరి, పత్తి, మిర్చి వంటి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, ఈ సమయంలో 24 గంటల త్రీఫేస్ విద్యుత్ అందించాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ కోతలతో రాష్ట్ర రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటిదాకా యూరియా కట్టలు దొరకక రైతులు పడిన ఇబ్బందులను కళ్లారా చూశామని, నేడు పెట్టుబడి పెట్టిన పంట సాగునీరు లేక పూర్తిగా ఎండిపోవడంతో రైతన్నలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారని, ఈ పరిస్థితులను కూడా ప్రభుత్వం గమనించాలని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కావున, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సరిపడా విద్యుత్ 24 గంటలు అందించే విధంగా కృషి చేయాలని కోరుతున్నామని ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా, గత రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్ నినో సమస్య వల్ల నీటి కొరత, కరెంటు కొరత ఏర్పడుతుందని, కాబట్టి రైతులు రెండో పంట వేయడానికి ఆసక్తి చూపకూడదని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అంతేకాకుండా, పక్క రాష్ట్రానికి లేని ఎల్ నినో సమస్య తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉంటుందా అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వదిలేసిందని, చంద్రబాబు ప్రభుత్వం ఆ నీటిని ఒడిసిపట్టుకుని ఆ రాష్ట్రంలో రైతులకు నీరు అందిస్తోందని తెలియజేశారు. అధికార ప్రభుత్వ చేతకానితనం వల్ల కాళేశ్వరంలోని నీటిని పూర్తిస్థాయిలో వాడుకోవడంలో విఫలమయ్యారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.












