కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు, రామేశ్వరపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో పెద్దలు, చిన్నారులు ఆటపాటలతో పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు, రామేశ్వరపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ ఆటపాటలతో పెద్దలు, చిన్నారులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు వర్ష, సుకన్య, విజయలక్ష్మి మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా రామేశ్వరపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీలో బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. పెద్దరామావాస్య నుండి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. ఇదేవిధంగా అందరం కలిసి వచ్చే సంవత్సరం బతుకమ్మ పండుగను మరింత ఘనంగా చేసుకుంటామని తెలిపారు. ఈ సంబరాల్లో పెద్దలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

