ఉద్యోగ భద్రత కల్పించి, క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద గత 13 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం హెచ్ ఎం ) ఉద్యోగులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం పార్టీ నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి, ఉద్యోగులతో కలిసి సంఘీభావం తెలిపారు.
కలెక్టర్ కార్యాలయం వద్ద ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు గత 13 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) మద్దతు ప్రకటించింది. ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ తాహెర్, జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు సబ్బిడి రమేష్ సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగులతో కలిసి సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు.





