ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో దీపావళి కానుకగా రూ.8 వేలు ఇస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌లో నకిలీ సందేశాలు పంపిస్తూ ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు దోచుకుంటున్నారు.
ప్రధాని దీపావళి కానుక పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దీపావళికి రూ.8 వేలు ఇస్తున్నారంటూ సందేశాలు పంపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం పేరుతో వాట్సాప్‌లో నకిలీ సందేశాలు వస్తున్నాయి. ప్రధాని దీపావళి కానుక - మీకు రూ.8000 వచ్చింది, వెంటనే క్లిక్ చేయండి అంటూ లింకులతో కూడిన సందేశాలను సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారు. ఆ లింకుపై క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు అడిగి ఖాతాలోని డబ్బులు దోచేస్తున్నారు.






