జిల్లా మదనపల్లె పట్టణంలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. నక్కలదిన్నె సమీపంలోని సత్సంగ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మురుగు కాలువలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయం తమ నిత్య కృత్యాల కోసం వెళ్తున్న స్థానికులు, మురుగు కాలువలో వ్యక్తి విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లె పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతుడి ఒంటిపై ఏవైనా గాయాలున్నాయా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.












