కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు, కల్కి నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయాన్ని, అభయాంజనేయ స్వామి వారిని తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిజి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు, కల్కి నగర్ కాలనీలో గల కోటిలింగేశ్వర ఆలయాన్ని, అభయాంజనేయ స్వామి వారిని శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిజి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, మచ్చేందర్ తన సొంత ఖర్చులతో స్థలాన్ని కొని కోటి లింగేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నందున, వారికి సాక్షాత్తు కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తిచేయడానికి కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు, ధైర్యం కల్పించాలని స్వామిజి కోరారు. ఈ కార్యక్రమంలో మచ్చేందర్ కుటుంబ సభ్యులు, వివిధ ఆలయాల బ్రాహ్మణ అర్చకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











