ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎంకోర్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన క్రిస్ హేమ్స్‌వర్త్, క్రిస్ ప్రాట్, ఆంథోనీ మాకీ తదితరులు షూటింగ్ సమయంలో తీసిన అరుదైన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో కొత్త సన్నివేశాలు, అదనపు ఫుటేజ్‌తో పాటు కొన్ని ప్రత్యేక ముగింపు దృశ్యాలను కూడా జోడించారు.
2019లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వస్తున్న ఈ ప్రత్యేక ప్రదర్శనలో కొత్త పరిచయ సన్నివేశం, అదనపు ఫుటేజ్‌తో పాటు కొన్ని ప్రత్యేక ముగింపు దృశ్యాలను కూడా జోడించారు. ముఖ్యంగా ఐమ్యాక్స్, ఇన్ఫినిటీ విజన్ వంటి భారీ తెరల ప్రదర్శనల్లో ప్రత్యేక ముగింపు భాగాన్ని చూడొచ్చని సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
థోర్ త్రోబ్యాక్ ఫొటోలతో క్రిస్ హేమ్స్‌వర్త్
ఎండ్గేమ్లో థోర్ పాత్రలో నటించిన క్రిస్ హేమ్స్‌వర్త్, తన సామాజిక మాధ్యమ ఖాతాలో సినిమా షూటింగ్ నాటి ఫొటోలను పంచుకున్నారు. ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి వచ్చిందని, మరోసారి పెద్ద తెరపై ఈ అనుభూతిని ఆస్వాదించాలని అభిమానులను కోరారు.











