భారత్‌లో ఆన్లైన్ షాపింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ () వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మిలీనియల్స్ ఏఐ ఆధారిత షాపింగ్‌లో జెన్ జీ ( ) కంటే ముందున్నారు. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
మెకిన్సే నివేదిక ప్రకారం, భారత్‌లో షాపింగ్ కోసం ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో మిలీనియల్స్ 84తో అగ్రస్థానంలో ఉన్నారు. జెన్ జీ, జెన్ ఎక్స్ వర్గాలు 74తో తర్వాతి స్థానాల్లో నిలవగా, బేబీ బూమర్స్ 56 ఏఐని ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత షాపింగ్‌లో చైనా 80 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, భారత్ 76 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ సగటు 53 శాతంగా నమోదైంది. ఇది భారతీయులు టెక్నాలజీని ఎంత వేగంగా స్వీకరిస్తున్నారో తెలియజేస్తుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
షాపింగ్ కోసం ఏఐ చాట్, సెర్చ్ టూల్స్‌ను ఉపయోగిస్తున్న భారతీయుల్లో 87 శాతం మంది వాటిపై నమ్మకం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నమ్మకం సగటున 73 శాతంగా ఉంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జెన్ జీ యువతలో ఏఐ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ, దానిపై నమ్మకం మాత్రం కొంత తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా జెన్ జీ ఏఐ వినియోగదారుల్లో 67 శాతం మంది మాత్రమే ఏఐ చాట్, సెర్చ్ టూల్స్‌పై నమ్మకం వ్యక్తం చేశారు. మెకిన్సే సంస్థ 2020లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్, చైనా, అమెరికా, బ్రిటన్ సహా మొత్తం 11 దేశాలకు చెందిన సుమారు 21 వేల మంది వినియోగదారులు పాల్గొన్నారు. షాపింగ్‌లో ఏఐ ద్వారా ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవడం, వివిధ వస్తువులను పోల్చి చూడడం, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలను ఈ సర్వే పరిశీలించింది.












