లేదా
భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పూర్వీకుల ఇంటి పునర్నిర్మాణం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, తమ పూర్వీకుల ఇంటిని తామే పునర్నిర్మిస్తున్నామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వ బుల్డోజర్తో కూల్చివేత జరగలేదని వారు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వారణాసిలోని బిస్మిల్లా ఖాన్ పాత ఇంటికి సంబంధించిన దృశ్యాలను అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బీజేపీ, దాని మద్దతుదారులు కళలు, కళాకారులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతరత్న గ్రహీతకు చెందిన సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేయడం దేశ గౌరవానికే నష్టం కలిగించడమేనని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి వస్తే బిస్మిల్లా ఖాన్ సంగీత వారసత్వాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా శ్రవణ సంగ్రహాలయం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై బిస్మిల్లా ఖాన్ మనవళ్లు సిఫ్తేన్ హుస్సేన్, అఫాక్ హైదర్ స్పందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబ సభ్యుల వివరణ
తమ పూర్వీకుల ఇల్లు చాలా పాతదై శిథిలావస్థకు చేరుకుందని, ప్రమాదం జరగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులే పునర్నిర్మాణ పనులు చేపట్టారని వారు తెలిపారు. అక్కడికి ప్రభుత్వ బుల్డోజర్ రాలేదని, ఈ పనులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా తీసుకోవడం లేదని వారు వివరించారు. పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో బిస్మిల్లా ఖాన్ జీవిత విశేషాలు, సంగీత జ్ఞాపకాలను భద్రపరిచే మ్యూజియం ఏర్పాటు చేయాలని కుటుంబం భావిస్తోంది. మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులు నివసించనున్నారు.

