దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన మూడు రోజుల బ్యాంకు సమ్మె, రెండో శనివారం, ఆదివారం సెలవులతో కలిసి వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. నుంచి 30 వరకు జరగనున్న ఈ సమ్మె ప్రభావం శాఖల కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది.
బ్యాంకు ఉద్యోగ సంఘాలు వారానికి ఐదు రోజుల పని దినం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనితో పాటు పెన్షన్ నవీకరణ, పెన్షనర్లకు ఒకే విధమైన కరువు భత్యం లెక్కింపు విధానం, జాతీయ పెన్షన్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానానికి మారే అవకాశం వంటి అంశాలను కూడా సంఘాలు ప్రస్తావిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ముందుగానే ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకోవాలని సూచించాయి. శాఖల్లో నగదు లావాదేవీలు, పత్రాల పనులు, ఉద్యోగుల సహాయం అవసరమయ్యే సేవల్లో ఆలస్యం లేదా అంతరాయం ఉండవచ్చని హెచ్చరించాయి.











