కొమురం భీం జిల్లా కేంద్రంలోని రాజంపేటలో ఓం శ్రీ సాయి దుర్గ మండలిలో నవరాత్రులను పురస్కరించుకుని ఆదివారం భక్తులు అమ్మవారి దీక్షలు స్వీకరించారు. క్రాంతి కుమార్, విజయ్, సాయిరామ్, సువర్ణ, వనితతో పాటు పలువురు సివిల్ స్వాములు అమ్మవారి మాలను ధరించారు.
అర్చకుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించి, భక్తులకు మాలధారణ చేయించారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో దీక్ష చేపట్టిన భక్తులకు పూజా విధానాలు, దీక్ష సమయంలో పాటించాల్సిన నియమాల గురించి వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మాల ధరించిన సమయంలో ఆచరించాల్సిన నియమావళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిత్య పూజలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తనకు సంబంధించిన నియమాలను అర్చకుడు శివప్రసాద్ తెలియజేశారు. దీక్షను భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో కొనసాగించాలని సూచించారు.





