జిల్లా రాయచోటిలో జనసేన పట్టణ యూత్ అధ్యక్షులు ముదిరిన విజయ్ కుమార్, ఆయన భార్య పద్మావతిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దాడి చేశారని జనసేన నేతలు ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే కారణంతోనే ఈ దాడి జరిగిందని వారు తెలిపారు.
జనసేన పట్టణ యూత్ అధ్యక్షులు ముదిరిన విజయ్ కుమార్ (బుల్లెట్ విజయ్), ఆయన భార్య జనసేన వీర మహిళ పద్మావతిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దాడి చేశారని జనసేన నేతలు ఆరోపించారు. తమ మాట వినకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే కారణంతో శివారెడ్డి, మోహిత్ రెడ్డి, మస్తాన్, ఉమర్, మరికొందరు తమపై దాడికి పాల్పడ్డారని వారు తెలిపారు. వీడియో తీస్తున్న సమయంలో రాళ్లతో దాడి చేశారని, ఇది టీడీపీ నేతల పైశాచికత్వాన్ని సూచిస్తోందని జనసేన నేతలు విమర్శించారు. ఈ సంఘటనపై వారు తీవ్రంగా స్పందించారు. కూటమిలో భాగస్వామ్య పార్టీ నేతలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ఈ దాడిని ఖండిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి




