ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్లలో ఒకటైన బినాన్స్ భారీ సైబర్ దాడితో కుదేలైంది. సుమారు 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు చోరీకి గురైన ఘటన తర్వాత వినియోగదారులు తమ నిధులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. ఉపసంహరణ సేవలను తిరిగి ప్రారంభించిన తొలి తొమ్మిదిన్నర గంటల్లోనే బినాన్స్ నుంచి నికరంగా 3.64 బిలియన్ డాలర్ల విలువైన నిధులు బయటకు వెళ్లినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ ఉపసంహరణల్లో మొత్తం 4.65 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులను వినియోగదారులు బయటకు తీసుకెళ్లగా, అదే సమయంలో సుమారు 1.01 బిలియన్ డాలర్ల నిధులు బినాన్స్లోకి డిపాజిట్ అయ్యాయి. దీంతో నికరంగా 3.64 బిలియన్ డాలర్ల నిధుల తరలింపు నమోదైంది. బినాన్స్ వద్ద నాటికి 171 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయని సంస్థ తెలిపింది. ఈ ఉపసంహరణలు మొత్తం ఆస్తుల్లో 2.1 శాతానికి సమానమని వెల్లడించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
95 శాతం నిధులు భర్తీ చేశామన్న బినాన్స్
వినియోగదారులకు ఎలాంటి ఆర్థిక నష్టం కలగకుండా చోరీకి గురైన ఆస్తుల విలువను తామే భరిస్తామని బినాన్స్ ప్రకటించింది. ఇప్పటివరకు దొంగిలించిన మొత్తం ఆస్తుల్లో సుమారు 95 శాతాన్ని భర్తీ చేసినట్లు తెలిపింది. మిగిలిన ఐదు శాతం ఆస్తులు తక్కువ లభ్యత ఉన్న క్రిప్టో టోకెన్లు కావడంతో వాటిని సమకూర్చేందుకు మరింత సమయం పట్టవచ్చని వివరించింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు సంస్థ ఖజానా, బీమా నిధులు, వినియోగదారుల రక్షణ నిధిని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.












