దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) మోహరింపును పదేపదే పొడిగించడాన్ని సవాలు చేస్తూ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఆషిష్ జోషి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నిర్దిష్ట పరిస్థితుల్లో బలగాల మోహరింపును వరుసగా పొడిగించడంపై ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు.
ఢిల్లీలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపును కేంద్ర హోంశాఖ మరోసారి పొడిగించింది. న రామ్‌లీలా మైదాన్‌లో జరగనున్న ఇండియా కూటమి నిరసన సభ, ఇతర సంస్థల నుంచి ఆకస్మిక నిరసనలు జరిగే అవకాశం, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ వంటి కారణాలను అధికారులు ప్రస్తావించారు. ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
270 కంపెనీల మోహరింపు
మొత్తం 270 కంపెనీల బలగాలు ఢిల్లీలో స్థానిక పోలీసులతో కలిసి విధులు నిర్వహించనున్నాయి. వీటిలో కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) నుంచి 125 కంపెనీలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నుంచి 20, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నుంచి 46, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) నుంచి 39, సశస్త్ర సీమా బల్ నుంచి 31, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నుంచి 12 కంపెనీలు ఉన్నాయి.












