వైద్య విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) శుభవార్త అందించింది. 201920 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ కోర్సులో చేరిన అర్హులైన విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఒకసారి అదనపు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో గతంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు తమ వైద్య విద్యను కొనసాగించే అవకాశం లభించింది.
201920 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందిన అర్హులైన విద్యార్థులు ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించే సాధారణ అదనపు పరీక్ష కాదు. ఎన్ఎంసీ నిర్దేశించిన అర్హతలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారికే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కొవిడ్ ప్రభావం, విద్యార్థుల అభ్యర్థనలు
కొవిడ్ మహమ్మారి సమయంలో విద్యా కార్యక్రమాలకు అంతరాయాలు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, ఇతర అనివార్య పరిస్థితుల కారణంగా కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దీంతో తమకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు, విద్యాసంస్థల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ అభ్యర్థనలను పరిశీలించిన ఎన్ఎంసీ అర్హులైన విద్యార్థులకు ఒకసారి ప్రత్యేక అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.












