ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా యమునా నదిపై నమో యమునా రివర్ సఫారీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధూ పాల్గొన్నారు. సోనియా విహార్ నుంచి జగత్పూర్ వరకు విద్యుత్ క్రూయిజ్ బోట్లను అందుబాటులోకి తెచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా యమునా నదిపై నమో యమునా రివర్ సఫారీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధూ పాల్గొన్నారు. సోనియా విహార్ నుంచి జగత్పూర్ వరకు సుమారు 56 కిలోమీటర్ల మార్గంలో విద్యుత్‌తో నడిచే క్రూయిజ్ బోట్లను పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో ప్రయాణానికి సుమారు 40 నిమిషాల సమయం పడుతుంది. ఒక్క బోటులో 30 మంది ప్రయాణించవచ్చు. యమునా నదిపై పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, నది పట్ల ప్రజల్లో అనుబంధాన్ని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని రేఖా గుప్తా తెలిపారు. ఈ నూతన ప్రాజెక్టు ద్వారా యమునా నది అందాలను పర్యాటకులు ఆస్వాదించవచ్చని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










