ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, సాంకేతికత వినియోగం, పోలీసుల సంక్షేమం అత్యంత కీలకమని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం ద్వారా సురక్షితమైన ప్రాంతాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గౌరవనీయులైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లు, దక్షిణాది రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు, వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు, ప్రతినిధులకు హృదయపూర్వక స్వాగతం. మన హైదరాబాద్ నగరానికి మీ అందరికీ సాదర స్వాగతం. సదస్సు మన రాష్ట్రంలో, మన హైదరాబాద్‌లో జరుగుతుండటం మనకు గర్వకారణం. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదుల వంటివి. సమర్థవంతంగా, నైతిక విలువలతో, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థను అందించాలని ప్రజలు కోరుకుంటారు. నేరాల స్వరూపం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వంటి వేదికలు ఎంతో కీలకం. పోలీసింగ్ విధానాలు మారాలి, సంస్కరణలు నిరంతరం కొనసాగాలి.











