డాక్సిన్ టైమ్స్ (డాక్సిన్ టైమ్స్) జూలై 08
భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటర్ల సౌకర్యార్థం ECINET – One App for All Election Services పేరుతో ఒక నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఓటర్లకు అవసరమైన అన్ని ఎన్నికల సేవలను ఒకే చోట పొందవచ్చు.
భారత ఎన్నికల సంఘం (Election Commission of India) అందుబాటులోకి తీసుకువచ్చిన ECINET – One App for All Election Services ద్వారా ఓటర్లకు కావాల్సిన ఎన్నికల సంబంధిత సేవలు ఇప్పుడు మొబైల్లోనే అందుబాటులో ఉన్నాయి.
ఓటరు నమోదు, ఓటరు జాబితాలో పేరు పరిశీలన, e-EPIC డౌన్లోడ్, దరఖాస్తుల స్థితి తెలుసుకోవడం, BLO మరియు ఎన్నికల అధికారులతో సంప్రదించడం వంటి అనేక సేవలను ECINET యాప్ ద్వారా సులభంగా పొందవచ్చు.
ఓటరు నమోదు నుండి పోలింగ్ వరకు.. అన్నీ కేవలం ఒక క్లిక్‌తో పొందవచ్చు. ఇప్పుడే Android లేదా iOS స్టోర్ నుండి ECINET యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.












