ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, సాగు, తాగు నీటి లభ్యత క్షీణిస్తుందని, దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎల్ నినోను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు మూడు రకాలుగా ఉంటాయని, అవి వరదలు, కరువు, భూకంపాలని తెలిపారు. భూకంపం క్షణాల్లో భారీ నష్టాన్ని కలిగిస్తుందని, ఆ తర్వాతే మనం ఉపశమన చర్యలు చేపట్టగలమని చెప్పారు. వరదలు, సునామీలు కొన్ని గంటల ముందు సూచనలతో వస్తాయని, అయితే కరువు ప్రారంభమైనప్పుడు దాని ప్రభావం మొదట తెలియదని, నెమ్మదిగా అది తీవ్రమవుతుందని వివరించారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శిస్తున్నారని, అయితే ఎల్ నినో ప్రభావం తెలంగాణలోనే కాదు, ఇంగ్లాండ్, అమెరికా, మన దేశంలో మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ఉందని, అన్ని చోట్లా తాగు నీటి కష్టాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో నీటి రేషన్ అమలు చేస్తున్నారని తెలిపారు. వచ్చే జూలై వరకు తాగు నీటి కష్టాలు కొనసాగుతాయని, ఎండ తీవ్రత పెరిగి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. తాగు నీటి కష్టాలు ఇంకా పెరుగుతాయని అన్నారు.