తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితానికి సంబంధించిన పాత్రలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు జె.ఎం. బషీర్ తెరకెక్కిస్తున్న ఎంజీఆర్ బయోపిక్ కోసం త్రిషను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నారా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితానికి సంబంధించిన పాత్రలో ఆమె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు జె.ఎం. బషీర్ తెరకెక్కిస్తున్న ఎంజీఆర్ బయోపిక్ కోసం త్రిషను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎంజీఆర్ జీవిత కథతో బయోపిక్
తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన దివంగత నేత ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) జీవితం ఆధారంగా పురట్చి తలైవర్ ఎంజీఆర్ పేరుతో బయోపిక్ రూపొందుతోంది. ఇందులో ఎంజీఆర్ పాత్రను నటుడు జె.ఎం. బషీర్ పోషించనున్నారు. ఆయన ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. ఎంజీఆర్ బాల్యం నుంచి సినీ ప్రయాణం, రాజకీయాల్లోకి ప్రవేశం, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు వరకు పలు కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం.
జయలలితగా త్రిష
ఎంజీఆర్ జీవితంలో జయలలితకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. అనంతరం జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బయోపిక్‌లో జయలలిత పాత్రకు ప్రాధాన్యత ఉండనుంది. ఈ పాత్ర కోసం త్రిషను సంప్రదించినట్లు జె.ఎం. బషీర్ వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. జయలలిత పాత్రకు త్రిష సరిపోతారని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఆమె ఈ సినిమాకు అంగీకరించారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

