కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ పరిణామంతో స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో ఉప సర్పంచ్ గుంటికాడి ప్రవీణ్, కురుమ సంఘం అధ్యక్షుడు భాస్కరి మల్లేష్‌తో పాటు అసిరిపతి మనోజ్, భాస్కరి రాములు, పిప్పరి యేసుస్వామి, మధుసూదన్, రజినీకాంత్, దుమాల రవి, సంజీవ చారి, మనోహర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు.





