హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ల ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది.
గతంలో నెలవారీ పాస్‌కు రూ.8,500 చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం దానిని రూ.4,000కు తగ్గించారు. రోజువారీ పాస్ ధరను కూడా రూ.400 నుంచి రూ.275కు కుదించారు. ఈ కొత్త ధరలు నుంచి అమల్లోకి వచ్చాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నెలవారీ పాస్ వివరాలు
కొత్తగా నిర్ణయించిన రూ.4,000 నెలవారీ పాస్‌లో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్‌తో నెలలో గరిష్ఠంగా 50 సింగిల్ మెట్రో ప్రయాణాలు చేయవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ప్రయాణాల సంఖ్యపై పరిమితి ఉండదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.





