హైదరాబాద్ నగర పోలీస్ శాఖలో వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కానిస్టేబుళ్లు, హోంగార్డులపై డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లోనూ సంబంధిత సిబ్బందిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
నగర పోలీస్ శాఖలో వరుసగా వెలుగుచూస్తున్న వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కానిస్టేబుళ్లు, హోంగార్డులపై డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లోనూ సంబంధిత సిబ్బందిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఫిల్మ్‌నగర్‌లో రూ.50 వేల వసూలు ఆరోపణ
మొదటి ఘటనలో నార్సింగికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి తన కుటుంబ బంగారాన్ని బ్యాంకు నుంచి విడిపించుకునేందుకు స్నేహితుడి వద్ద రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. న షేక్‌పేట్ నాలా జంక్షన్ సమీపంలో నగదు లెక్కిస్తున్న సమయంలో ఇద్దరు పోలీసు సిబ్బంది అతడిని అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాగులో ఉన్న నగదుపై ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తామని బెదిరించి రూ.70 వేలు డిమాండ్ చేశారని, చివరకు రూ.50 వేలు తీసుకున్నారని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ మాల్సూర్, హోంగార్డు మోహన్‌పై కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సనత్‌నగర్‌లో బైక్ విడిచేందుకు డబ్బులు డిమాండ్
రెండో ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్లో పనిచేసే హరికృష్ణ అనే బైక్ రైడర్ నుంచి బైక్ విడుదల చేసేందుకు రూ.2 వేలు డిమాండ్ చేశారని ఆరోపణ. చివరకు రూ.1,000 చెల్లించి బైక్ తీసుకున్న బాధితుడు జరిగిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోగా వెల్లడించాడు. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు బాధితుడిని సంప్రదించి ఫిర్యాదు తీసుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్, హోంగార్డు శేఖర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.





