ఫ్రాన్స్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో రష్యా రహస్య సోషల్ మీడియా నెట్వర్క్ తప్పుడు ప్రచారానికి పాల్పడినట్లు యూరోపియన్ యూనియన్ నివేదిక వెల్లడించింది.
ఫ్రాన్స్‌లో ఇటీవల చెలరేగిన అల్లర్లను ఆసరాగా చేసుకుని రష్యాకు సంబంధం ఉన్న రహస్య సోషల్ మీడియా నెట్వర్క్ తప్పుడు ప్రచారానికి పాల్పడినట్లు యూరోపియన్ యూనియన్ అంతర్గత నివేదిక వెల్లడించింది. వలసదారులు నిరసనకారులపై అత్యాచారాలకు పాల్పడ్డారంటూ, దేశంలో ఉగ్రవాద దాడులు జరగబోతున్నాయంటూ నకిలీ వార్తలను ప్రచారం చేసినట్లు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆపరేషన్ ఓవర్‌లోడ్ పేరుతో పనిచేస్తున్న ఈ నెట్వర్క్ పాశ్చాత్య మీడియా సంస్థల పేర్లతో నకిలీ వీడియోలు, వార్తా కథనాలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు నివేదిక పేర్కొంది.











