ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై కాక్రాచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. బుధవారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరో నేత అజింక్య షిండేను వ్యక్తిగత బాండ్పై విడుదల చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, సీజేపీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతానికి అధికారిక నిరసన స్థలంగా గుర్తింపు హోదాను తొలగించిన తర్వాత అక్కడికి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు ఆరోపించారు. మూసివేసిన గేట్లు, పోలీసు బారికేడ్లు దాటి లోపలికి వెళ్లి, జాతీయ జెండాను ప్రదర్శిస్తూ నినాదాలు చేసినట్లు వెల్లడించారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కేసు నమోదు
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీజేపీ నేతలతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడం, చట్టవిరుద్ధంగా గుమిగూడడం వంటి ఆరోపణలను కేసులో చేర్చారు.











