తెలంగాణలో ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేరుస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. చట్టపరమైన చిక్కులు లేని విధంగా, నివాసయోగ్యమైన ప్రాంతంలో స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ఆయన తెలిపారు.
శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయిందని తెలిపారు. 2022లో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత కూడా గతంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.











