కామారెడ్డి, 2026-07-24
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బరువు తక్కువతో ఒక ఆడ శిశువు జన్మించింది. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన హన్మొల సంతోషి మూడవ కాన్పులో శస్త్రచికిత్స ద్వారా ఈ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బరువు తక్కువతో ఒక ఆడ శిశువు జన్మించింది. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన హన్మొల సంతోషి మూడవ కాన్పులో శస్త్రచికిత్స ద్వారా ఈ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఈరోజు ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది.
శిశువు బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సరిగా ఏడవకపోవడం, నీరసంగా ఉండటం వంటి సమస్యలు కనిపించాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు వైద్యులు ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో, సాయంత్రం 7:30 గంటలకు నియోనాటల్ 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి శిశువును తరలించారు.
నిజామాబాద్ ఆసుపత్రికి చేరుకునేసరికి పాప పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. దీంతో పాప తండ్రి నవీన్ వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. EMT కృష్ణ స్వామి, పైలట్ మహేష్ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.












