కృష్ణా జిల్లాలో కృష్ణా నదిలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయిన వారి మృతదేహాలను గాలింపు చర్యల అనంతరం వెలికితీశారు. అధికారులు నదిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
మండలం పరిధిలోని పాత ఎడ్లంక గ్రామానికి చెందిన రైతు మునిపల్లి బాలస్వామి ఆదివారం సాయంత్రం పశువులను మేపేందుకు కృష్ణా నది మధ్యలోని లంక ప్రాంతానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి నదిలో గల్లంతయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విషయం తెలిసిన వెంటనే స్థానికులు, జాలర్లు పడవలతో గాలింపు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో బాలస్వామి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











