దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతుల్లో కీలక మైలురాయిని చేరుకుంది. భారత్‌లో తయారైన విద్యుత్ కార్లను విదేశాలకు పంపించడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 50 వేల యూనిట్లకు పైగా ఎగుమతి చేసింది. 2023లో అంతర్జాతీయ ఎగుమతులు ప్రారంభించిన సంస్థ, ఏడాదికిపైగా వ్యవధిలోనే ఈ ఘనత సాధించింది.
భారత్ నుంచి ఎగుమతి అవుతున్న విద్యుత్ ప్రయాణికుల కార్ల విభాగంలో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి సెప్టెంబర్ వరకు దేశం నుంచి జరిగిన ఎలక్ట్రిక్ ప్రయాణికుల వాహనాల ఎగుమతుల్లో సంస్థ వాటా దాదాపు 93 శాతంగా నమోదైంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన ఎగుమతిదారుగా మారుతీ సుజుకీ నిలిచింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ అదే స్థానాన్ని కొనసాగించింది. కంపెనీ తన తొలి అంతర్జాతీయ బ్యాటరీ విద్యుత్ వాహనం ఈ-విటారాను గుజరాత్‌లోని హన్సల్పూర్ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తోంది.












