ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి కస్టడీలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ () నాయకులు ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను వెంటనే విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. వారి జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ చర్యను మమతా బెనర్జీ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంగా అభివర్ణించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ ()లో మమతా బెనర్జీ అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు. యువతను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. జెన్-జీ యువతను వేధించడం ఆపాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోల్‌కతా నుంచి ఢిల్లీ, ముంబై వరకు దేశవ్యాప్తంగా అణచివేత చర్యలు పెరిగాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యువత ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత అధికారంలో ఉన్నవారు ఎప్పటికీ అధికారంలో ఉండరని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారంతా ఆశుతోష్, సౌరవ్‌ల విడుదలకు మద్దతు ఇవ్వాలని కోరారు.











