ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో డెంగ్యూ జ్వరంతో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు కేవలం మూడు గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో కసద్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలోని కసద్ గ్రామానికి చెందిన ముఖేశ్ కుశ్వాహ, ఆయన భార్య దీప కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో డెంగ్యూ ఉన్నట్లు తేలింది. తొలుత స్థానికంగా చికిత్స చేయించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఈ నెల 19న వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆగ్రాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, బుధవారం రాత్రి చికిత్స పొందుతూ ముఖేశ్ మరణించారు. భర్త మృతి విషయం తెలుసుకున్న దీప తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత సుమారు మూడు గంటల్లో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒకే కుటుంబంలో కొద్ది గంటల వ్యవధిలో రెండు మరణాలు సంభవించాయి.












