పాకిస్థాన్ టీవీ యాంకర్ రబియా అహ్సాన్ అనుమానాస్పద మృతి కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. తొలుత ఆమె భర్తపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా బాధితురాలి కుటుంబం కేసును ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు వస్తున్న వార్తలతో దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది.
రావల్పిండిలోని గుల్షన్ఆబాద్లో ఉన్న తన నివాసంలో రబియా తుపాకీ గాయాలతో కనిపించారు. కాల్పుల శబ్దం విని కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లగా ఆమె రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక వివరాలు వెల్లడించాయి. ఘటనాస్థలంలో పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల విచారణ
ఈ ఘటనపై రబియా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తుపాకీ అనుకోకుండా పేలిందని ఆమె భర్త చెప్పినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే పోలీసులు ఆయుధానికి సరైన లైసెన్స్ లేదని పేర్కొన్నారు.











