పాకిస్థాన్‌లో ప్రజలకు అవసరమైన పోషకాహారం అందుబాటులో లేకపోవడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో తృణధాన్యాలు, చక్కెర వంటివి అవసరానికి మించి ఉన్నా, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాల సరఫరాలో గణనీయమైన లోటు ఉందని తాజా నివేదిక వెల్లడించింది. 60 శాతానికి పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే స్థోమత కలిగి లేరని పేర్కొంది.
పాకిస్థాన్‌లో ప్రజలకు అవసరమైన పోషకాహారం అందుబాటులో లేకపోవడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో తృణధాన్యాలు, చక్కెర వంటి ఆహార పదార్థాలు అవసరానికి మించి అందుబాటులో ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమైన కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాల సరఫరాలో గణనీయమైన లోటు ఉందని తాజా నివేదిక వెల్లడించింది. పాకిస్థాన్ జాతీయ ఆహార మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలందరికీ సమతుల ఆహారం అందడం లేదని పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
60 శాతానికి పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే స్థోమత కలిగి లేరని నివేదిక పేర్కొంది. పోషకాహార లోపం కొనసాగుతుండగా, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువు వంటి ఆహారపు అలవాట్లతో ముడిపడిన అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని హెచ్చరించింది.












