రైతుల ఆదాయాన్ని పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పంట మార్పిడిని ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మండలం గురజకుంట గ్రామంలో కూరగాయల సాగు చేస్తున్న 58 మంది రైతులకు ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఈ పథకం కింద కూరగాయల సాగుకు ఎకరాకు రూ.9,600, మల్చింగ్ విధానానికి ఎకరాకు రూ.8,000 చొప్పున మొత్తం రూ.17,600 వరకు రాయితీ అందించనున్నట్లు ఆయన తెలిపారు. గురజకుంట గ్రామానికి చెందిన రైతులకు సుమారు రూ.4 లక్షల మేర రాయితీలు మంజూరయ్యాయి. దీంతో లబ్ధిదారులైన రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చని ఆయన సూచించారు. మల్చింగ్ విధానంతో నేలలో తేమను కాపాడుకోవడంతో పాటు కలుపు మొక్కలను నియంత్రించి, నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరిస్తూ ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అర్హులైన రైతులందరూ ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, రైతుల పెట్టుబడి భారం తగ్గించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగన్నగారి నరేందర్ రెడ్డి, గురజకుంట సర్పంచ్ సంతోష్ రెడ్డి, తిప్పాపూర్ సర్పంచ్ కుంట లింగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.












