కామారెడ్డి, 2026-07-31
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిట్లం ఎస్సై బి. ఆంజనేయులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని, సురక్షిత ప్రదేశాల్లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పాడుబడ్డ లేదా పగుళ్లు ఉన్న ఇళ్లలో ఉండకూడదని, కరెంట్ స్తంభాలు, తెగిన వైర్లకు దూరంగా ఉండాలని, వాటిని ముట్టుకోకూడదని హెచ్చరించారు. బోర్ మోటార్లు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాగులు, వంతెనలు, నదులను దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు ఎక్కువగా చేరిన ప్రాంతాల్లో నడవకూడదని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు బయటకు వెళ్లకుండా చూడాలని, తాగునీటిని మరిగించి మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈత కోసం, చేపల కోసం, సరదాగా సెల్ఫీలు దిగేందుకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.