కామారెడ్డి, July 30
కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ఆపరేషన్ కవచ్" కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో నేరాలు జరగకముందే వాటిని అరికట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గంజాయి స్వాధీనం, వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు వంటి అంశాల్లో విశేష ఫలితాలు సాధించారు.
జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ఆపరేషన్ కవచ్" కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో నేరాలు జరగకముందే వాటిని అరికట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
ఆపరేషన్ కవచ్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు, వాహనాల చెకింగ్, అనుమానితులపై నిఘా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో గణనీయమైన ఫలితాలు సాధించారు.
ఈ ఏడాది కాలంలో సాధించిన ప్రధాన విజయాలు: * 400 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకుని, సుమారు రూ.2.01 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. * 5.16 లక్షలకు పైగా వాహనాలను తనిఖీ చేసి అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. * మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 3,500కు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. * వివిధ నేర ముఠాల గుట్టురట్టు చేసి, నేరాల నియంత్రణలో కీలక విజయాలు సాధించారు.











