ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త అడ్వెంచర్ టూరర్ బైక్ హిమాలయన్ 750 ను ఆవిష్కరించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హిమాలయన్ 450 కంటే పెద్ద ఇంజిన్, మెరుగైన టూరింగ్ సదుపాయాలతో ఈ కొత్త మోడల్ ను తీసుకొస్తోంది. నవంబర్ చివరి వారంలో గోవాలో జరిగే మోటోవర్స్ కార్యక్రమంలో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
హిమాలయన్ 750 లో కొత్త 750 సీసీ సమాంతర ట్విన్ సిలిండర్ ఇంజిన్ ను ఉపయోగించారు. దీనికి ఆరు గేర్ల గేర్‌బాక్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇంజిన్ సామర్థ్యం, శక్తి, టార్క్ కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఇంజిన్ 55 హెచ్‌పీకి పైగా శక్తిని, 60 న్యూటన్ మీటర్లకు పైగా టార్క్ ను అందించవచ్చని ఆటోమొబైల్ నివేదికలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొత్త ఫీచర్లు
ఈ బైక్ లో ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి సదుపాయాలు ఉన్నాయి. ముందు సస్పెన్షన్ లో సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పించారు. వెనుక సస్పెన్షన్ లోనూ అవసరానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు.
ముందువైపు రెండు డిస్క్ బ్రేకులు, ఎత్తును మార్చుకునే హెడ్ ల్యాంప్, సర్దుబాటు చేసుకునే విండ్ స్క్రీన్ వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాయ్ వీల్స్ తో పాటు ట్యూబ్ లెస్ టైర్లు అమర్చుకునే వీలున్న క్రాస్-స్పోక్ వీల్స్ ఎంపికలు కూడా ఉండనున్నాయి.







