రష్యాలోని సమారా ప్రాంతంలో ఉన్న నోవోకుయ్బిషెవ్స్క్ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడితో రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న అనధికారిక విరామానికి తెరపడినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఆకాశంలోకి దట్టమైన పొగ వ్యాపించింది.
సమారా ప్రాంతంలోని నోవోకుయ్బిషెవ్స్క్ చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని తెల్లవారుజామున డ్రోన్లతో దాడి జరిగినట్లు సమాచారం. దాడి అనంతరం అక్కడ మంటలు చెలరేగి, ఆకాశంలోకి దట్టమైన పొగ వ్యాపించినట్లు స్థానికులు తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వెలువడ్డాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కర్మాగారం రష్యా ప్రభుత్వ నియంత్రణలోని రోస్నెఫ్ట్ () సంస్థకు చెందినది. ఏడాదికి సుమారు 88 లక్షల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉంది. విమాన ఇంధనం, పెట్రోల్, డీజిల్, లూబ్రికెంట్లు వంటి ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు.











