డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత ఫుట్‌బాల్ జట్టు సాఫ్ ఛాంపియన్షిప్ 2026లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని నేషనల్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.
భారత జట్టుకు నౌషాద్ మూసా ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరగనున్న అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ల కారణంగా ప్రధాన జట్టులోని పలువురు ఆటగాళ్లు ఈ టోర్నీకి అందుబాటులో లేరు. దీంతో రెండో శ్రేణి జట్టుతో భారత్ బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌కు 18 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా, మిగిలిన ఆటగాళ్లు తర్వాత జట్టుతో చేరనున్నారు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 138వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 197వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 29 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తలపడగా భారత్ 16 విజయాలు సాధించింది. పాకిస్థాన్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలవగా, తొమ్మిది మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2023లో బెంగళూరులో జరిగిన సాఫ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 4-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈసారి కూడా విజయం సాధించి టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించాలని భారత జట్టు భావిస్తోంది. భారత్ గ్రూప్-బిలో పాకిస్థాన్, మాల్దీవులతో కలిసి ఉంది. మాల్దీవులతో రెండో మ్యాచ్ ఆడనుంది. సెమీఫైనల్స్, 17న ఫైనల్ జరగనున్నాయి. భారత్ ఇప్పటివరకు తొమ్మిదిసార్లు సాఫ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. ఈసారి పదో టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మ్యాచ్‌ను వేటో లైవ్ స్ట్రీమ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





