గృహ సంబంధిత పనులలో, ముఖ్యంగా వంట, ఇంటిని శుభ్రంగా ఉంచడం వంటి బాధ్యతలను కేవలం మహిళలకే పరిమితం చేయరాదని, భర్తలు కూడా ఇందులో భాగస్వామ్యం వహించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది.
2017లో వివాహం చేసుకున్న ఒక జంటకు ప్రస్తుతం ఒక బాబు ఉన్నాడు. వివాహం జరిగిన వారం రోజుల నుంచే భార్య తనను వేధిస్తోందని, ఇంటి పనులు చేయడం లేదని ఆరోపిస్తూ భర్త విడాకుల కోసం దిగువ కోర్టును ఆశ్రయించాడు. దిగువ కోర్టు విడాకులను మంజూరు చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు విడాకుల మంజూరును కొట్టివేసింది. ఈ వ్యవహారం అనంతరం సుప్రీంకోర్టుకు చేరడంతో, దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.











