పశ్చిమగోదావరి
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పరిమి రవికుమార్ ఓటమిపై పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పరిమి రవికుమార్ ఓటమిపై పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగింది. సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో రవికుమార్ కన్నీటిపర్యంతమయ్యారు. తన ఓటమికి సొంత పార్టీ నాయకులే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో ఇద్దరు పార్టీ కార్యకర్తలు తమ శరీరాలపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కూడా పార్టీ నేతల వ్యవహారశైలిపై విమర్శలు చేశారు. కడియద్ద ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ గెలిచినప్పటికీ జనసేన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని, వెంకట్రామన్నగూడెంలో టీడీపీ అభ్యర్థి ఏడు ఓట్ల ఆధిక్యంతో గెలిచినా, ఫలితాన్ని తమకు అనుకూలంగా ప్రకటించలేదని ఆయన ఆరోపించారు. కడియద్దలో రీకౌంటింగ్ నిర్వహించి జనసేన అభ్యర్థిని గెలిపించారని, అదే విధంగా వెంకట్రామన్నగూడెంలోనూ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరితే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి




