భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందని, రాబోయే 60-70 సంవత్సరాలకు దేశ ఇంధన భద్రతను ఇది నిర్ధారిస్తుందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా బొగ్గు రంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, బొగ్గు బ్లాకుల కేటాయింపులో పారదర్శకతను పెంచాయని తెలిపారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద బొగ్గు నిల్వలను కలిగి ఉందని, ఇది దేశ ఇంధన అవసరాలను దీర్ఘకాలం తీర్చగలదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 74 శాతం బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లపైనే ఆధారపడి ఉందని మంత్రి వివరించారు. దేశీయ బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడానికి ప్రభుత్వం అన్వేషణ కార్యకలాపాలను ముమ్మరం చేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా, వినియోగదారుగా ఉందని ఆయన అన్నారు.











