202627 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ () ఎక్స్ప్రెషన్ సిరీస్ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా, విద్యార్థులు నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 6.0లో పాల్గొనేందుకు పాఠశాలలు ప్రోత్సహించాలని సూచించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ () 202627 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఎక్స్ప్రెషన్ సిరీస్ నిర్వహణపై తాజా సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనను బోర్డు నవంబర్ నెల సర్క్యులర్లలో చేర్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తాజాగా విడుదలైన సర్క్యులర్ ప్రకారం.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 6.0లో విద్యార్థులు కూడా పాల్గొనేలా పాఠశాలలు ప్రోత్సహించాలని సూచించింది. ఈ అవార్డుల ఆరో ఎడిషన్‌ను ఇటీవల ప్రారంభించారు.












