కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రిలయన్స్ జియో సంస్థ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఈ నెల 6న కలెక్టరేట్ లోని ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈ మేళా జరగనుంది.
జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ జాబ్ మేళా 06-11-2026 శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులో గల రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో నిర్వహించబడుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రిలయన్స్ జియో సంస్థ నెట్వర్క్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టుల కోసం ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. మొత్తం 20 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డిప్లొమా ( లేదా ) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.












