పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందించడంలో జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో అరుదైన ఘనత సాధించారు. పోలీస్ కమిషనరేట్లను మినహాయించి జిల్లాల వారీగా మొబైల్ ఫోన్ల రికవరీలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ వెల్లడించారు.
జిల్లాలో ప్రత్యేక సాంకేతిక బృందం ప్రతినెలా సగటున 150కి పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2.23 కోట్ల విలువైన 1,397 ఫోన్లను స్వాధీనం చేసుకోగా, గత 45 రోజుల్లోనే రూ.42.24 లక్షల విలువైన 264 ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. గత ఏడాది రూ.3 కోట్ల విలువైన 1,834 ఫోన్లను బాధితులకు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సీఈఐఆర్ () పోర్టల్ ద్వారా ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 5,678 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు రూ.9.08 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందం ఈ సేవలు అందిస్తోంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన బృందాన్ని ఎస్పీ అభినందించారు.












